ఎంపీడీవో సరళపై వైసీపీ ఎమ్మెల్యే దాడిని ఖండిస్తున్నాం : నారా లోకేశ్
ఏపీలో రాక్షసపాలన సాగుతోందని ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.. రాక్షస పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. మహిళలపై జగన్‌కు ఎందుకింత కక్షో అర్థం కావడం లేదన్నారు. 45 ఏళ్లకే పెన్షన్ అని మోసం చేశారని లోకేశ్మండిపడ్డారు. మద్యపాన నిషేధమని ఇళ్ల మధ్యే సారా దుకాణాలు తెరిచి మహిళలకు ఇబ్బంది పెడుతున్నారని ఫైరయ్యారు.
ఇప్పుడు మహిళా అధికారిపై వైసీపీ ఎమ్మెల్యే దాడి చేశారంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. అవినీతి, అక్రమాలకు సహకరించకపోతే చంపేస్తానంటూ మహిళా ఎంపీడీవో సరళపై వైసీపీ ఎమ్మెల్యే చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. వైసీపీ పాలనలో మహిళా అధికారులు బతకలేని పరిస్థితి తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో సామాన్య మహిళల పరిస్థితి తలుచుకుంటేనే ఆందోళన కలుగుతోందన్నారు లోకేశ్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com