ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాక్‌!

ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాక్‌!
X

ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాక్‌ ఇచ్చింది. పోలవరంకు చెల్లించాల్సిన 3 వేల కోట్లను నిలిపివేయాలని ఆదేశించింది. పోలవరం పనులకు సంబంధించి 6 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు ఉండడంతో.. 3 వేల కోట్లు చెల్లించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఫైల్‌ను సిద్ధం చేసింది. కేంద్ర ఆర్థికశాఖ ఆమోదానికి కూడా పంపింది. అయితే ఆఖరు నిమిషంలో ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితోనే నిధులు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది. సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన ఖరారైన తరువాత ఈ పరిణమాం చోటు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Next Story