మెగాస్టార్ 'సైరా నరసింహారెడ్డి' మూడు రోజుల కలెక్షన్లు చూస్తే..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ ఊహించని విధంగా ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో భారీ వసూళ్ల దిశగా వెళుతోంది. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే రూ. 32 కోట్లు రాబట్టిన సైరా.. ఆ తరువాత కూడా తన ఊపును కొనసాగిస్తోంది. నైజాంలో తొలి మూడు రోజుల్లో (తొలిరోజు రూ. 8.10 కోట్లు, రెండోరోజు రూ. 3.98 కోట్లు, మూడో రోజు రూ. 2.54 కోట్లు) మొత్తం రూ. 14.62 కోట్లు రాబట్టిందని ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్వీట్ చేశారు..
అలాగే ఓవర్సీస్ మార్కెట్‌లోనూ సైరా సత్తా చాటుతోందని.. మూడు రోజుల్లో అమెరికాలో రూ. 1.5 మిలియన్ డాలర్లు (రూ. 10.62 కోట్లు) రాబట్టిందని రమేశ్ బాలా మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక ఇదే ఊపును కొనసాగిస్తే తొలివారంలోనే 'సైరా' రూ.150 కోట్ల మార్కును దాటే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వీకెండ్ కావడం, పైగా దసరా సెలవులు కావడంతో సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com