'అప్పుడే చర్య తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా'

అప్పుడే చర్య తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా

నెల్లూరు జిల్లా వెంకటాచలం MPDO సరళపై వైసీపీ ఎమ్మెల్యే దౌర్జన్యాన్ని ట్విట్టర్‌తో తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు. విధి నిర్వహణలో నిజాయితీగా ఉన్న ఓ మహిళా అధికారిణిపై వైసీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. తనకు న్యాయం చేయాలని అర్థరాత్రి ఆ మహిళా అధికారి స్టేషన్‌కు వెళ్తే కేసు తీసుకోవడానికే జంకుతారేంటని ప్రశ్నించారు బాబు. ఈ రాష్ట్రంలో పోలీసింగ్‌ ఉన్నట్టా లేనట్టా అంటూ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నలు సంధించారు.

వైసీపీ నేతలు చెప్పిన అక్రమాలు చేయకపోతే మహిళలని కూడా చూడరా అని ప్రశ్నించారు చంద్రబాబు. ఇంటికి కరెంట్‌, నీటి కనెక్షన్‌ కట్‌ చేయడం ఏమిటన్నారు. ముఖ్యమంత్రికి ఇవేమీ కనబడటం లేదా అని చంద్రబాబు ట్విట్టర్‌లో ఏకిపారేశారు. ఇదే ఎమ్మెల్యే గతంలో ఓ ముస్లిం మైనారిటీ జర్నలిస్ట్‌ను ఫోన్‌లో చంపుతానని బెదిరించారని గుర్తు చేశారు. జమీన్‌రైతు సంపాదకుడితోపాటు ఓ మహిళా డాక్టర్‌పై ఇదే ఎమ్మెల్యే చేసిన ఆగడాలను ట్విట్టర్‌లో బాబు ప్రశ్నించారు. అప్పుడే ప్రభుత్వం చర్య తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story