డ్రైవర్‌పై చెప్పులతో దాడి చేసిన లేడీ కండక్టర్

డ్రైవర్‌పై చెప్పులతో దాడి చేసిన లేడీ కండక్టర్

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆర్టీసీ కార్మికుల ధర్నాలు, రాస్తారోకోలతో పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల పరిస్థితి అదుపు తప్పింది. సమ్మెను లెక్క చేయకుండా ప్రభుత్వం ప్రైవేట్‌ డ్రైవర్లను పెట్టి నడిపిస్తుండడంపై ఆర్టీసీ కార్మికులు భగ్గుమంటున్నారు. పలు జిల్లాల్లో ఆర్టీసీ కార్మికులు బస్సులపై దాడికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో ఆర్టీసీ కార్మికులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భారీ బందోబస్తు మద్య ప్రైవేటు డ్రైవర్లతో బస్సుల్ని నడిపేందుకు ప్రయత్నించగా ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ప్రైవేట్‌ డ్రైవర్‌పై ఆర్టీసీ కార్మికులు రాళ్లతో దాడి చేశారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పింది. కార్మికులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

యాదగిరి గుట్టలోనూ టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. యాదగిరి డిపో నుండి హైదరాబాద్‌కు బయలుదేరుతున్న బస్సులను ఆర్టీసీ కార్మికులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బస్సులు ముందుకు కదలకుండా నిలువరించారు. తాత్కలిక బస్సు డ్రైవర్‌పై ఓ లేడీ కండక్టర్ చెప్పులతో దాడి చేసింది. ఆందోళనకారులు బస్సులను ధ్వంసం చేశారు. పరస్పరం దూషణలతో పరిస్థితి వేడెక్కింది.

Tags

Read MoreRead Less
Next Story