అరుదైన రికార్డ్.. 66వ టెస్టులోనే 350వ వికెట్ తీసిన దిగ్గజ స్పిన్నర్లు..

అరుదైన రికార్డ్.. 66వ టెస్టులోనే 350వ వికెట్ తీసిన దిగ్గజ స్పిన్నర్లు..

భారత దిగ్గజ స్పిన్ ద్వయంగా గుర్తింపు పొందిన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వ్యక్తిగత రికార్డులు సాధించి సత్తా చాటారు. తన 66వ టెస్టులో 350వ వికెట్ సాధించిన రవిచంద్రన్ అశ్విన్ ఆల్ టైం గ్రేట్ ముత్తయ్య మురళీధరన్‌కు ధీటుగా నిలిచాడు. సరిగ్గా మురళీధరన్ కూడా తన 66వ టెస్టులోనే 350వ వికెట్ సాధించి, అప్పట్లో అతి తక్కువ టెస్టుల్లో ఆ ఫీట్ సాధించిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ఇన్నేళ్ల తతరువాత అశ్విన్ సైతం సరిగ్గా ఆ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. విశాఖ టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై అశ్విన్ మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌తో సహా మొత్తం 8 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయానికి బాటలు వేశాడు. 2011లో టెస్టుల్లో అడుగుపెట్టిన అశ్విన్‌కు తన 66 మ్యాచ్‌లో 350వ రికార్డు వికెట్ సాధించుకున్నాడు.

ఇటీవలి కాలంలో టీమిండియాలో వరుసగా చోటు దక్కించుకుంటున్న మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా ఈ టెస్ట్‌లో తనదైన ముద్ర వేశాడు. జడేజా మొదటి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో మొత్తం ఆరు వికెట్లు తీసి.. టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ ప్రక్రియలో తక్కువ టెస్ట్ మ్యాచ్‌ల్లో వేగంగా 200 వికెట్లు సాధించిన ఎడమచేతి స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. శ్రీలంక స్పిన్నర్ రంగన హెరాత్ గతంలో 47 టెస్టుల్లో 200 వికెట్లు తీసి సృష్టించిన రికార్డును జడేజా తిరగరాశాడు.

2012లో టెస్ట్ క్రికెట్‌లో అడుగుపెట్టిన జడేజా మూడు మ్యాచ్‌ల ముందుగానే ఈ రికార్డును చేరుకున్నాడు. ఈ ఫీట్‌ను అందుకోవడానికి ఆస్ట్రేలియా స్టార్ బౌలర్లు మిచెల్ జాన్సన్ కు 49 టెస్టులు, మిచెల్ స్టార్క్ కు 50, అలనాటి భారత దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీకి 51 టెస్ట్ మ్యాచ్ లు అవసరమయ్యాయంటేనే వీరి ప్రతిభ తేటతెల్లమౌతోంది. విశాఖ టెస్ట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ల ఎకానమీ రేటు 5.5 తో పోలిస్తే అశ్విన్, జడేజా సగటున 3.2 ఎకానమీతో వికెట్లు పడగొట్టి అదుర్స్ అనిపించారు.

Tags

Next Story