వికారాబాద్‌ జిల్లాలో విషాదం.. పత్తిచేనులో కూలిన శిక్షణ విమానం..

వికారాబాద్‌ జిల్లాలో విషాదం.. పత్తిచేనులో కూలిన శిక్షణ విమానం..
X

వికారాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బంట్వారం మండలం సుల్తాన్‌పూర్‌ వద్ద శిక్షణ విమానం కుప్పకూలింది. దీంతో ఇద్దరు పైలెట్లు దుర్మరణం పాలయ్యారు. పత్తిచేనులో విమానం కూలడంతో ప్రమాదంలో శిక్షణ పైలట్‌ ప్రకాశ్‌ విశాల్‌ అక్కడికక్కడే మృతిచెందగా మరో పైలెట్ తీవ్రంగా గాయపడి మృతిచెందారు. ప్రమాదంలో విమానం పూర్తిగా దెబ్బతింది విమానం బేగంపేట్‌ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా విమానం అదుపుతప్పి బురదలో కూరుకుపోయినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న వెంటనే బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Tags

Next Story