సిద్ధిపేటలో విషాదం.. పిడుగు పడి ఇద్దరు మృతి

సిద్ధిపేటలో విషాదం.. పిడుగు పడి ఇద్దరు మృతి

సిద్ధిపేటలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సిద్ధిపేట టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చింతలచెరువు కట్టపై ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భారీ వర్షం వస్తోందని.. హునుమనగర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు చింత చెట్టు కింద నిలబడ్డారు. అదే సమయంలో పిడుగు పడి ఇద్దరు స్పాట్‌లో మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. మొదట ఘటనా స్థలానికి చేరుకున్న టూటౌన్‌ ఎస్‌ఐ కనయ్య మృతుల శవాలను సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి.. క్షతగాత్రుని చికిత్స కోసం తరలించారు.

దుర్ఘటన గురించి తెలుసుకున్న మంత్రి హరీష్‌ రావు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. వెంటనే మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఇలాంటి ఘటన జరగడం దురదృష్ణకరమన్నారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తరువాత తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న బాధితుడ్ని పరామర్శించి.. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story