ఫ్లిప్‌కార్ట్ మరో భారీ సేల్.. 50 వేల ప్రొడక్టులు.. 75% డిస్కౌంట్..

ఫ్లిప్‌కార్ట్ మరో భారీ సేల్.. 50 వేల ప్రొడక్టులు.. 75% డిస్కౌంట్..
X

కస్టమర్లకు మరోసారి గాలం వేసింది ఫ్లిప్‌కార్ట్. మరో బ్రహ్మాండమైన బిగ్ దివాళీ సేల్‌ని నిర్వహించబోతోంది. అక్టోబర్ 11 రాత్రి 8 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. టీవీలు, అప్లయెన్సెస్ విభాగంలో 50,000 పైగా ప్రొడక్ట్స్‌పై 75% వరకు డిస్కౌంట్ అందించనుంది ఫ్లిప్‌కార్ట్. రిఫ్రిజిరేటర్ల ప్రారంభ ధర రూ.6,490. 5 రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులపై దాదాపు 90 శాతం వరకు తగ్గింపు ప్రకటించింది. 3 కోట్లకు పైగా ఉత్పత్తులపై నో కాస్ట్ ఈఎంఐ, ప్రొడక్ట్స్ ఎక్సేంజ్ లాంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. ఫ్యాషన్‌కి సంబంధించిన ఉత్పత్తులపై 50-80% వరకు, ఫర్నిచర్‌పై 40-80% వరకు, ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్స్‌పై 90% వరకు తగ్గింపు అందించనుంది. బిగ్ దివాళీ సేల్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI క్రెడిట్ కార్డులు ఉపయోగించేవారికి 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.

Tags

Next Story