విశాఖ పోలీసులపై భారత క్రికెటర్లు సీరియస్‌

విశాఖ పోలీసులపై భారత క్రికెటర్లు సీరియస్‌

విశాఖ టెస్టులో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన క్రికెటర్లకు ఆగ్రహం తెప్పించారు పోలీసులు. అధికారుల మధ్య అవగాహన లోపంతో భారత క్రికెటర్లు వర్షంలో తడవాల్సి వచ్చింది. భారత జట్టు ఉన్న బస్సును విశాఖ ఎయిర్‌పోర్టు మూడో ఫ్లాట్‌ఫాంలో నిలిపారు. అయితే అప్పటికే భారీ వర్షం పడుతుండడంతో వారంతా అక్కడి నుంచి తడుసుకుంటూ ఎయిర్‌పోర్టులోకి వెళ్లాలసి వచ్చింది. ఫస్ట్‌ ఫ్లాట్‌ ఫాంలో ఎందుకు బస్‌ పార్క్‌ చేయలేదని ఎయిర్‌ పోర్ట్‌ సీఐను రోహిత్‌ శర్మ ప్రశ్నించాడు. అక్కడ సౌతాఫ్రికా క్రికెటర్ల బస్సు ఉందని చెప్పడంతో.. భారత క్రికెటర్లు అలానే వెళ్లిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story