త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సానియా మీర్జా చెల్లెలు.. వరుడు..

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సానియా మీర్జా చెల్లెలు.. వరుడు..
X

టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా.. ప్రముఖ క్రికెటర్ అజహరుద్దీన్ తనయుడు అసద్ వివాహం త్వరలో జరగనుంది. వీరి పెళ్లి డిసెంబర్‌లో ఉంటుందని సానియా ప్రకటించింది. ఢిల్లీలో టెన్నిస్ టోర్నీకి ముఖ్య అతిథిగా హాజరైన సానియా ఈ విషయాన్ని వెల్లడించింది. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. అసద్ కంటే ఆనమ్ మూడేళ్లు పెద్ద అని సమాచారం. గతంలోనే ఆనమ్‌కు వివాహమై విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిరువురి వివాహానికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరూ ఒక్కటవనున్నారు. 'లబేల్ బజార్' పేరిట ఆనం మీర్జా ఫ్యాషన్ ఔట్ లెట్ నిర్వహిస్తోంది. అసద్ న్యాయవాదిగా ఉన్నారు.

Tags

Next Story