అంతర్జాతీయం

పంది రేటు లక్ష రూపాయలు.. అయినా ఫుల్ డిమాండ్..

పంది రేటు లక్ష రూపాయలు.. అయినా ఫుల్ డిమాండ్..
X

డిమాండ్‌కి తగ్గ ఉత్పత్తి లేదు. పందుల్ని బాగా పెంచండి అని ప్రభుత్వం చైనీయుల్ని ప్రోత్సహిస్తోంది. బాగా బరువున్న పందికైతే మరింత డిమాండ్. చైనాలో పందుల బిజినెస్ ద్వారా లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. వాటికి మంచి ఫుడ్ పెట్టి బాగా బలిష్టంగా తయారు చేస్తారు. ఇలా బలంగా దాదాపు 500 కేజీ వరకు పెరుగుతాయి. రేటు కూడా భారీగానే ఉంది. ఒక్కో పంది రేటు లక్షరూపాయలు పలుకుతోంది. పందుల పెంపకాలను ప్రభుత్వం ప్రోత్పహించినా అక్కడి వారికి సరిపోవట్లేదు. మాంసంతో పాటు పోర్క్ (పంది మాంసం) కూడా చైనీయులు బాగా తింటారు. దాంతో పందుల కొరత వచ్చింది. ప్రస్తుతం పందుల బిజినెస్ ద్వారా వ్యాపారులు మంచి లాభాలనార్జిస్తున్నారు. మనదేశంలో కోడి మాసం, మేక మాంసానికి ఉన్నంత డిమాండ్ చైనాలో పంది మాంసానికి ఉంది.

Next Story

RELATED STORIES