ఎస్‌బీఐ శుభవార్త.. ఇకనుంచి డెబిట్‌ కార్డులపై కూడా..

ఎస్‌బీఐ శుభవార్త.. ఇకనుంచి డెబిట్‌ కార్డులపై కూడా..

ఇప్పటికే hdfc బ్యాంకు తన కష్టామర్లకు ఈజీ ఈఎంఐ పేరుతో డెబిట్ కార్డు మీద వస్తువు లోన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే.ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. డెబిట్‌ ఎస్‌బీఐ కస్టమర్లకు ఇకనుంచి డెబిట్‌ కార్డుపై ఈఎంఐ సౌకర్యం కల్పించనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 40,000కుపైగా వాణిజ్య సముదాయాలు, వ్యాపార సంస్ధల వద్ద ఏర్పాటు చేసిన పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ (పీఓఎస్‌) వద్ద ఎస్‌బీఐ డెబిట్‌కార్డుదారులు వస్తువులను కొనుగోలు చేస్తే.. ఆ అమౌంట్ ఈఎంఐ రూపంలో చెల్లించుకోవచ్చని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ వెల్లడించారు.

ఈ సదుపాయం కోసం ఎలాంటి ప్రాసెసింగ్‌, డాక్యుమెంటేషన్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, అంతేకాదు సేవింగ్స్‌ ఖాతాలో అకౌంట్‌ బ్యాలెన్స్‌తో సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. ఒక్క నిమిషంలోనే ఈ సదుపాయం పొందవచ్చని తెలిపారు. ఇందుకోసం కస్టమర్లు ఈఎంఐ అర్హతను చెక్‌ చేసుకునేందుకు డీసీఈఎంఐ అని టైప్‌ చేసి 567676 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయాలని ఎస్‌బీఐ తెలిపింది. అయితే ఈ సదుపాయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఆఫర్ పొందాలంటే కస్టమర్ల క్రెడిట్ హిస్టరీ ఉన్నంతంగా ఉండాలి, ప్రస్తుతం పే చేస్తున్న ఈఎంఐలు ఎటువంటి అంతరాయం లేకుండా ఉండేట్టు చూసుకోవాలి. అంటే ఏదైనా ఈఎంఐ బౌన్స్ అయితే క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Next Story