శ్రీవారికి అందుకే చక్రస్నానం చేయిస్తారు..
X
By - TV5 Telugu |8 Oct 2019 10:33 AM IST
తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానం వేదమంత్రోచ్ఛారణల మధ్య కన్నులపండువగా జరిగింది. తొమ్మిది రోజులుగా వివిధ వాహనాలపై ఊరేగిన శ్రీవారు సేదతీరేందుకే ఈ చక్రస్నానం ఉంటుంది. వరాహస్వామి ఆలయం వద్ద ఉన్న పుష్కరిణిలో స్వామివారి చక్రతాళ్వార్‌కు స్నపన తిరుమంజనాలు పూర్తి చేసిన తర్వాత స్నానం చేయించారు. ఈ ఘట్టాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాత్రి ఆలయంలో ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com