పొలంబాట పట్టిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే..

పొలంబాట పట్టిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే..

ఆమె ఓ ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌. అడవిని వదిలి అసెంబ్లీ బాటపట్టారు. ఆయుధం విడిచి కలం చేతపట్టారు. న్యాయవాద వృత్తిని చేపట్టి PHD చేస్తూ నిత్య విద్యార్థిగా మారారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. పరిచయం పెద్దగా అవసరంలేని సీతక్క ప్రస్తుతం దసరా సందర్భంగా పొలం బాటపట్టారు.

ములుగు జిల్లా జగ్గన్నపేట ఎమ్మల్యే సీతక్క స్వగ్రామం. పుట్టిన ఊరంటే సీతక్కకు ఎంతో అభిమానం. దసరా సెలవుల సందర్భంగా సొంత ఊళ్లో తిరిగి అందరినీ అప్యాయంగా పలకరించారు. తల్లిదండ్రులు సాగుచేస్తున్న పత్తి పొలంలో దిగి కలుపుతీశారు. ఆ తర్వాత గుంటుక కొట్టారు. పురుగుల మందులు పిచికారి చేశారు సీతక్క. చిన్నపుడు వరినాట్లకు తునికాకు సేకరణకు వెళ్లిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story