పిడుగు పాటుకు మహిళ మృతి.. అపస్మారక స్థితిలో మరో ముగ్గురు

తెలుగు రాష్ట్రాలను పిడుగు పాట్లు బెంబెలెత్తిస్తున్నాయి. గత వారం రోజులుగా వరుస ఘటనలతో పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు విడిచారు. మరీ ఎక్కువగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, మహిళా కూలీలు పిడుగుపాటుకి బలి అవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. వెలిగండ్ల మండలం పాపిరెడ్డిపల్లిలో పొలం పనులకు వెళ్లిన మహిళలపై పిడుగుపడింది. ఈప్రమాదంలో తిరుపతమ్మ అనే మహిళ మృతి చెందింది. మరో ముగ్గురు మహిళలు అపస్మాకస్థితిలోకి వెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే వారిని కనిగిరి ఆస్పత్రికి తరలించారు. మరో ఐదుగురు మహిళలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పిడుగుపాటుపై ప్రభుత్వాలు ముందే హెచ్చరిస్తున్నా..ప్రాణాపాయం మాత్రం తప్పడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోటు పిడుగుపాట్లు గ్రామీణ ప్రజలను హడలెత్తుస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com