ఆర్టీసీ సమ్మెపై బుధవారం కీలక సమావేశాలు

ఆర్టీసీ సమ్మెపై బుధవారం కీలక సమావేశాలు జరగనున్నాయి. లీగల్ నోటీసులపై బుధవారం కార్మిక జేఏసీ నేతలు సమావేశం కానున్నారు. పూర్తి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. అటు ఆర్టీసీ సమ్మె నాలుగో రోజూ కొనసాగుతోంది.

బుధవారం అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఇందులో ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు హాజరై తమ ఆవేదన వినిపించనున్నారు. అటు ప్రభుత్వం డిపోల వారీగా జిల్లా కలెక్టర్ల నుంచి రిపోర్టు తెప్పించుకుంటోంది. పండుగ రద్దీ నేపథ్యంలో తిరుగు ప్రయాణంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రబుత్వం ధృష్టి పెట్టింది.

Tags

Next Story