వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కల్వకుర్తి మండలంలోని రఘుపతి పేట దుందుభి వాగులోకి ప్రైవేటు ఆర్టీసీ బస్సు అదుపు తప్పి దూసుకెళ్లింది. వెంటనే స్పందించిన కొందరు ప్రయాణికులు బస్సులో నుంచి దిగేశారు. అయితే అంతలోనే బస్సు ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. అప్పటికి బస్సులో ఇంకొంత మంది ప్రయాణికులున్నారు. అయితే మిగతా ప్రయాణికులు.. స్థానికులతో కలిసి వారిని సురక్షితంగా బయటకు దించారు. అనుభవం లేని డ్రైవర్‌.. వాగు ప్రవాహ వేగాన్ని అంచనా వేయకపోవడం వల్లే ఇలా జరిగిందని.. ప్రయాణికులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story