తెలంగాణలో వైభవంగా దసరా వేడుకలు

దసరా వేడుకలను వైభవంగా నిర్వహించుకున్నారు తెలుగు ప్రజలు. తెలంగాణ పల్లెలన్ని వేడుకలతో సందడిగా మారాయి. చెడుపై మంచి విజయం సాధించిన వేళ..రాముడి రావణ సంహారం చేసిన ఘట్టాన్ని గుర్తు చేస్తూ ఊరూవాడ రావణ దహనం చేశారు. ఆయుధ పూజలు నిర్వహించారు. శమీ పూజ నిర్వహించి జమ్మి ఆకు ఇచ్చిపుచ్చుకుంటూ అలాయ్ బలాయ్ చేసుకున్నారు.
హైదరాబాద్ లో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ప్రజలు. ఆలయాల్లో పూజలు నిర్వహించి జమ్మి ఆకు పంచుకున్నారు. హైదరాబాద్ అంబర్ పేట్ లో నిర్వహించిన వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన రావణుడిని బొమ్మను దహనం చేసే ఘట్టాన్ని తిలకించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు.
వరంగల్ రూరల్ జిల్లాలోని పల్లెలు, పట్టణాలు ఘనంగా దసరా వేడుకలను నిర్వహించుకున్నారు. బొడ్రాయి దగ్గర సోరకాయ బలితో వేడుకలు ప్రారంభం అయ్యాయి. దసరా ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. రావణ వథ నిర్వహించారు.
దశకంఠుడైన రావణున్ని మట్టుబెట్టి ఆయోధ్య రాజుగా శ్రీరాముడు పట్టాభిషక్తుడైన పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖలో దసరా వేడుకను వైభవంగా నిర్వహించారు. ఇస్కాన్ ఆలయ ప్రాంగణంలో రావణవధ చేశారు.
ఊరువాడ రావణ వధ చేస్తే.. రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డి పేట మండలంలోని గొల్లపల్లి గ్రామం సాంప్రదాయినికి విరుద్ధంగా నినదించింది. రావణవథ నిర్వహించకూడదని ర్యాలీ నిర్వహించారు.
దసరా వేళ..కాకతీయుల ఆరాధ్యదైవం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రులు వైభవంగా జరిగాయి. చివరి రోజున నిర్విహించిన తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో హజరయ్యారు.
సింహాచలం లో అప్పన్నస్వామి వారి జమ్మివేట మహోత్సవం వైభవంగా జరిగింది. రామావతారంలో ఉద్యానవనంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటే కష్టాలు తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. పూలతోటలో జమ్మివేట ఉత్సవం అనంతరం స్వామివారిని అశ్వవాహనంపై తిరువీధి నిర్వహించారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం విజయదశమి వేడుకలతో కొత్తశోభను సంతరించుకుంది. షమీ పూజ, ఆయుధ పూజ అనంతరం ధర్మపురి పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

