ముఖ్యమంత్రితో నెల్లూరు జిల్లా వైసీపీ నేతల సమావేశం

ముఖ్యమంత్రితో నెల్లూరు జిల్లా వైసీపీ నేతల సమావేశం
X

నెల్లూరు వైసీపీ నేతల పంచాయితీ ముఖ్యమంత్రి దగ్గరకు చేరింది.. సాయంత్రం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రితో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు సమావేశం కానున్నారు.. జిల్లాలో నేతల మధ్య వర్గ విభేదాలు, ఆధిపత్య పోరుపై ముఖ్యమంత్రి సీరియస్‌గా ఉన్నారు.. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో నేతల మధ్య సమన్వయ లోపంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.. అలాగే ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, కాకాణి మధ్య వివాదానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టే దిశగా చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈనెల 15న నెల్లూరులో జరగనున్న రైతు భరోసా కార్యక్రమంపైనా చర్చించనున్నారు.

Tags

Next Story