జబర్దస్త్‌ టీమ్‌కు దసరా కానుక ఇచ్చిన రోజా

జబర్దస్త్‌ టీమ్‌కు దసరా కానుక ఇచ్చిన రోజా

తెలుగు లోగిళ్లను నవ్వుల కేరింతలతో, తుళ్ళింతలతో ఊపేస్తోన్న ప్రోగ్రామ్ ' జబర్దస్త్ '. రోజా నవ్వుల వెన్నెల, నాగబాబు గాంభీర్యంతో కూడిన నవ్వుల జడ్జిమెంట్ ఈ ప్రోగ్రామ్ కే హైలెట్. అయితే దసరా పండుగ సందర్భంలో జరిగిన జబర్దస్త్ షూటింగ్ లో ఒక ఆసక్తికర పవిత్ర సన్నివేశం చోటు చేసుకుంది. తన కుటుంబ సభ్యుల్లా జబర్దస్త్ టీం మెంబెర్స్‌ని ఎంతో ఆప్యాయంగా చూసే రోజా టీం మెంబెర్స్ అందరికీ ఒక అపురూపమైన పుస్తకాన్ని దసరా గిఫ్ట్ గా ఇచ్చారు.

రోజా సమర్పించిన ఈ కానుక పేరే 'శ్రీ పూర్ణిమ'. సుమారు ఎనిమిదివందల అద్భుతమైన అందాల పవిత్ర పూజనీయ గ్రంధం ఈ శ్రీపూర్ణిమ. ఈ గ్రంథరచయిత , సంకలనకర్త ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్. గతంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖలో అత్యంత కీలక పదవిలో రాష్ట్ర ప్రభుత్వంచే నియమితులై, మహాక్షేత్రమైన శ్రీశైలదేవస్థానానికి కూడా ప్రత్యేక సలహాదారునిగా వ్యవహరించారు పురాణపండ శ్రీనివాస్.

పీఠాలలో, మఠాలలో, ఆలయాలలో, పండిత గృహాలలో , గ్రంథాలయాలలో, భక్తజన గృహాలలో పురాణపండ శ్రీనివాస్ పుస్తకాలు చాల ఉంటాయి. ఆయన రచించిన శ్రీ పూర్ణిమ గ్రంథానికి రోజా ప్రచురణ కర్తగా వ్యవహరించారు. దసరా సందర్భాన్ని పురస్కరించుకుని జబర్దస్త్ టీం అందరికీ రోజా ఈ అమృతమయ శ్రీ పూర్ణిమ గ్రంధాన్ని అందించడంతో హైపర్ ఆది, చలాకి చంటి మొదలు, దొరబాబు వరకు పరవశంతో రోజాకు 'థాంక్స్ మేడం ' సూపర్ బుక్ ఇచ్చారంటూ ధన్యవాదాలు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story