బిల్లు మంజూరు చేసేందుకు రూ. 7 లక్షలు లంచం డిమాండ్‌

బిల్లు మంజూరు చేసేందుకు రూ. 7 లక్షలు లంచం డిమాండ్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఓ అవినీతి అధికారి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. KTPS పవర్‌ ప్లాంట్‌ చీఫ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆనందం.. ఓ బిల్లు మంజూరు విషయంలో లంచం డిమాండ్‌ చేశాడు. 70 లక్షల విలువైన బిల్లు మంజూరు చేసేందుకు 10 శాతం డబ్బులు ఇవ్వాలని కాంట్రాక్టర్‌ లలిత మోహన్‌పై ఒత్తిడి తెచ్చాడు. రూ. ఏడు లక్షలు తన వల్ల కాదని అనడంతో.. చివరికి రూ.3 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు.

సీ‌ఈ లంచాల బాగోతంపై కాంట్రాక్టర్‌ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. పథకం ప్రకారం వలపన్ని ఎస్‌ఈ ఆనందంను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. చీఫ్‌ ఇంజనీర్‌ స్థాయి అధికారి ఇలా లంచాల కోసం దిగజారడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story