ఆర్టీసీ కార్మికుల సమ్మెతో క్యాజువల్ కండక్టర్ల చేతివాటం

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో క్యాజువల్ కండక్టర్ల చేతివాటం

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె... తాత్కాలిక సిబ్బందికి కాసులు కురిపిస్తోంది. ప్రయాణికుల నుంచి ఇష్టమొచ్చినంత వసూలు చేస్తున్నారు. అదేమని అడిగితే.. సమ్మె స్పెషల్ అంటూ సమాధానం చెప్తున్నారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. సిద్ధిపేట్ జిల్లా దుబ్బాక నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు సాధారణంగా 64 రూపాయల ఛార్జీ ఉండగా.. 150 రూపాయలు ఎలా వసూలు చేస్తారంటూ తాత్కాలిక కండక్టర్‌ను ప్రయాణికులు నిలదీశారు. దీంతో.. వాగ్వాదం చోటు చేసుకుంది. క్యాజువల్ కండక్టర్లు చేతివాటం చూపిస్తున్నారని ప్రయాణికులు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story