కళ్లు తెరవని అధికారులు.. టీటీడీలో మరోసారి అన్యమత ప్రచారం
By - TV5 Telugu |11 Oct 2019 7:17 AM GMT
ఎన్నిసార్లు తప్పులు జరిగినా టీడీడీ అధికారులు కళ్లు తెరవడం లేదు. తిరుమల కొండపై అన్యమత వివాదం కొనసాగుతుండగానే.. తాజాగా మరోసారి అన్యమత ప్రచారం కలకలం రేపుతోంది. అన్యమతానికి సంబంధించిన స్టిక్కర్లతో తిరుమలకు వాహనాలు చేరుకుంటున్నాయి. తమిళనాడుకు చెందిన ఓ వాహనంపై అన్య మతానికి చెందిన ఫొటోలు, శిలువ గుర్తులు ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అన్యమత వాహనాలను తిరుమలకు అనుమతించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com