బంగారం ధర స్వల్పంగా తగ్గి.. హైద్రాబాద్‌లో 10 గ్రాములు..

బంగారం ధర స్వల్పంగా తగ్గి.. హైద్రాబాద్‌లో 10 గ్రాములు..
X

దసరా వెళ్లి పోయింది.. దీపావళి రాబోతోంది. పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని బంగారు నగలు కొనాలనుకునే వారికి కాస్త శుభవార్తలాంటిదే ఈ ధరల తగ్గుదల. శుక్రవారం మార్కెట్‌లో బంగారం ధర రూ.100లు తగ్గింది. ప్రస్తుతం పది గ్రాముల ధర రూ.38073. హైదరాబాద్‌లో ధరలు చూస్తే 22 క్యారెట్ ధర రూ.36,660కాగా, 24 క్యారెట్ ధర రూ.39,990. దేశ రాజధాని డిల్లీలో వెండి ధర రూ.500 తగ్గి కేజీ వెండి రూ.45000కు చేరుకుంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర 48600. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,492 డాలర్లు, వెండి ధర 17.50 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ముగిసే వరకు అస్థిర పరిస్థితి కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీపావళి పండుగ, పెళ్లిళ్ల సీజన్‌ని పురస్కరించుకుని బంగారం ధరలు తగ్గితే కొనుగోళ్లు జరపవచ్చని సామాన్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Tags

Next Story