వెల్లుల్లితో బరువు తేలిగ్గా..

వెల్లుల్లితో బరువు తేలిగ్గా..

ఆహా ఏమి రుచి అనరా మైమరచి.. అల్లం వెల్లుల్లి వేస్తే కూరకి ఆ టేస్టే వేరు. వెల్లుల్లి కూరకి రుచితో పాటు, ఆరోగ్యాన్నీ అందిస్తుంది. ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. వెల్లుల్లిలో ఉన్న యాంటీ ఇన్ఫమేటరీ లక్షణాలు, రోగ నిరోధక శక్తిని పెంపొందించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. గుండెజబ్బులను, కీళ్ల నొప్పుల సమస్యలను నివారించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది.

వెల్లుల్లిలో ఉన్న మరో మంచి గుణం కొవ్వును కరిగించి బరువుని తగ్గిస్తుంది. ఇందులో ఉన్న విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, ప్రొటీన్‌లు వెల్లుల్లిలో ఉన్నాయి. మరి బరువుని తగ్గించడానికి వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాము.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తురిమిన వెల్లుల్లి రెబ్బలను రెండు తీసుకుని తేనెతో కలిపి తినాలి. ఇలా రోజూ తింటే రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడడంతో పాటు, బరువు తగ్గుతారు. ఆయుర్వేదంలో వెల్లుల్లికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.

వెల్లుల్లిని నిమ్మరసంతో కలిపి కూడా తీసుకోవచ్చు. ఒక కప్పు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం పిండాలి. అందులోనే ఒక వెల్లుల్లిని రెబ్బని దంచి ఆ నీటిలో వేయాలి. ఇది కూడా బరువుని తగ్గించడంలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓసారి డైటీషియన్‌కి సంప్రదించి ఈ పద్దతి ఫాలో అయితే మంచిది. అలా అని అతిగా తినడం కూడా మంచిది కాదు. రోజుకి ఒకటి రెడు రెబ్బలును మించి తినకూడదు. ఏదైనా అతి అనర్థమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story