మరోసారి భారీ వర్ష సూచన.. ఆ ప్రదేశాల్లో ఉండొద్దు..

మరోసారి భారీ వర్ష సూచన.. ఆ ప్రదేశాల్లో ఉండొద్దు..
X

కోస్తా, రాయలసీమకు మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం.. కొమెరిన్‌ తీరం నుంచి తమిళనాడు, రాయలసీమ మీదుగా కోస్తా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. అంతేకాకుండా కోస్తా తీరా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని.. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సముద్రం నుంచి తేమగాలులు భారీగా వీస్తాయని అందువల్ల విపరీతమైన చలి కొనసాగుతుందని తెలిపింది.

దీని ప్రబుభవంతో కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల పిడుగులు పడతాయని.. అందువల్ల ఎవరు నిర్జన ప్రదేశాల్లో ఒంటరిగా ఉండరాదని ఎత్తైన చెట్ల, ఎత్తైన ప్రదేశాల్లో ఉండవద్దని సూచించారు. కాగా గత రెండు రోజులుగా కోస్తాలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

Tags

Next Story