9 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న..

పుణె టెస్టుపై పట్టుబిగించింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో 601 పరుగుల భారీ స్కోరు సాధించిన కోహ్లీసేన.. సౌతాఫ్రికాకు టాప్‌ఆర్డర్‌ను కూల్చేసింది. రెండో రోజు ఆటముగిసే సరికి సఫారీలు 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయారు. అంతకుముందు.. 5 వికెట్ల నష్టానికి 601 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. రవీంద్ర జడేజా 9 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 91 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. జడేడా ఔటైన వెంటనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించాడు కోహ్లీ.
3 వికెట్ల నష్టానికి 273 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించింది టీమిండియా.. కోహ్లీ-రహానే జంట నాలుగో వికెట్‌కు 178 పరుగులు జోడించింది.. రహానే 59 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన జడేజాతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు కోహ్లీ. వేగంగా స్కోరు సాధించడమే లక్ష్యంగా ఈ ఇద్దరూ బ్యాట్ ఝుళిపించారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com