11 Oct 2019 9:39 AM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / రోజానే అలా అన్నారు:...

రోజానే అలా అన్నారు: గెటప్ శ్రీను

రోజానే అలా అన్నారు: గెటప్ శ్రీను
X

బుల్లితెర పాపులర్ షో జబర్ధస్త్.. ఈ షో ద్వారా చాలా మంది నటులు తాము వేసే స్కిట్లు, అందులో వేసే గెటప్‌ల ద్వారానే చెలామణీ అవుతున్నారు. చిత్ర విచిత్రమైన గెటప్స్ వేస్తూ, వెరైటీ వాయిస్ మాడ్యులేషన్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే గెటప్ శ్రీను ఇప్పటి వరకు 90 గెటప్‌లు వేశానని చెప్పాడు. ఓ సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తనను బుల్లి తెర కమల్ హాసన్ అని మొట్ట మొదటగా రోజా వ్యాఖ్యానించారని అన్నాడు. అయితే ఆ పేరుతో నన్ను పిలవడం బాగున్నా బరువుగా ఉందని చెప్పాడు. నటుడిగా సాధించాల్సింది చాలా ఉందని.. ప్రస్తుతానికి ఆపేరుకు తగ్గ అర్హత, అనుభవం తానింకా సంపాదించలేదని వెల్లడించాడు.

గెటప్ శ్రీను అనే పేరు కూడా జనం నుంచే వచ్చిందని అన్నాడు. జబర్ధస్త్ షోకి వచ్చాకే నటనలో చాలా మెళకువలు నేర్చుకున్నానని చెప్పాడు. ఇంకా నేర్చుకోవలసింది చాలా ఉందని అంటూ తాను వేసే గెటప్స్ అన్నీ బయట తాను చూసినవే అని చెప్పాడు. ఉదయం లేస్తే విభిన్నమైన వ్యక్తులు తారసపడుతుంటారని.. వారిలో నుంచే ఓ ఆలోచన పుడుతుందని.. అప్పుడే ఓ డిఫరెంట్ గెటప్‌కు మనసులో శ్రీకారం చుడతానని అన్నాడు. మెగాస్టార్ చిరంజీవి తన అభిమాన నటుడని చెప్పుకొచ్చాడు. తాను సినిమాలు బాగా చూస్తానని చెబుతూ.. చిరంజీవి సినిమా అయితే రిలీజైన మొదటి రోజే చూసేస్తానని అన్నాడు.

Next Story