రెండో టెస్టులోనూ అదరగొడుతోన్న కోహ్లీసేన

X
By - TV5 Telugu |11 Oct 2019 6:57 AM IST
దక్షిణాఫ్రికాపై టీమిండియా దూకుడు కొనసాగుతోంది. తొలి టెస్టు విజయంతో సిరీస్‌ను ఘనంగా ప్రారంభించిన కోహ్లీసేన రెండో టెస్టులోనూ అదరగొడుతోంది. వైజాగ్‌లో రెండు సెంచరీలతో రెచ్చిపోయిన రోహిత్ శర్మ 14 పరుగులకే ఔటై నిరాశపర్చాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. కెరీర్‌లో వరుసగా రెండు టెస్టుల్లోనూ సెంచరీలు చేసిన ఘనత సొంతం చేసుకున్నాడు. 195 బంతుల్లో 108 పరుగుల చేసి మెరిశాడు. పుజారా 58, కెప్టెన్ కోహ్లీ అజేయంగా 63 రన్స్ చేశారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో రబాడ 3 వికెట్లు తీశాడు. ప్రస్తుతం కెప్టెన్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ రహానే 18 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com