రూ. కోటి 50 లక్షల నకిలీ మందుల వ్యాపారం

రూ. కోటి 50 లక్షల నకిలీ మందుల వ్యాపారం
X

గుంటూరు జిల్లా పల్నాడులో కల్తీ పురుగుల మందుల వ్యవహారం కలకలం రేపుతోంది. రైతులకు నకిలీ మందులు అమ్ముతున్నారని ఫెర్టిలైజర్స్‌ షాపుల్లో డూపాయింట్‌ కంపెనీ ప్రతినిధులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా కల్తీ పురుగుల మందులు బయటపడంతో కంపెనీ ప్రతినిధులు షాక్‌ అయ్యారు. ఒక కోటి 50 లక్షల రూపాయల నకిలీ మందుల వ్యాపారం జరిగిందని ప్రతినిధులు గుర్తించారు.

జిల్లాలోని దాచేపల్లి, గురజాల, రెంటచింతల, మాచర్ల, పిడుగురాళ్ల, మాచవరం, కారంపూడి తదితర మండలాల్లో నకిలీ మందుల వ్యాపారం జోరుగా సాగుతున్నట్టు గుర్తించారు. తాజాగా గురజాల మండలం జంగమహేశ్వరంలోని రెండు షాపుల్లో కల్తీ మందులు పట్టుబడ్డాయి. తాము కొన్నవి నకిలీవని తెలిసి రైతులు లబోదిబోమంటున్నారు. అయితే ఇంత జరుగుతున్నా వ్యవసాయశాఖ అధికారులు స్పందించకపోవడం విశేషం.

Tags

Next Story