టీవీవీకి ఆ పార్టీతో సంబంధం ఉంది : హైదరాబాద్‌ సీపీ

టీవీవీకి ఆ పార్టీతో సంబంధం ఉంది :  హైదరాబాద్‌ సీపీ

తెలంగాణ విద్యార్థి వేదిక టీవీవీ నాయకుల అరెస్ట్‌లు కలకలం రేపుతున్నాయి. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై స్టూడెంట్ మార్చ్‌ పత్రిక ఎడిటర్‌, ప్రొఫెసర్‌ జగన్‌ను నిన్న గద్వాల పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే ఇదే కేసులో నాగరాజు అలియాస్‌ నాగన్నను అరెస్ట్‌ చేయగా.. నాగరాజును చూసేందుకు వచ్చిన వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన బలరాంను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రెండు రోజులుగా అలజడి రేపుతున్న టీవీవీ నాయకుల అరెస్ట్‌పై మీడియాతో మాట్లాడారు సీపీ. టీవీవీ నాయకుల అరెస్ట్ సంబంధించిన కారణాలను వివరించారు. తెలంగాణ విద్యార్థి వేదిక టీవీవీతో నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధం ఉందన్నారు హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌. నిషేధిత మావోయిస్టు పార్టీ నుంచి టీవీవీ సంస్థ ఏర్పడిందన్నారు.

తెలంగాణ విద్యార్థి వేదిక… అమాయకులైన విద్యార్థులను టార్గెట్ చేసి మావోయిస్టు పార్టీలో జాయిన్ చేస్తున్నారన్నారు సీపీ అంజనీ కుమార్‌. గద్వాల్‌లో పోలీసుల తనిఖీలో కొన్ని పుస్తకాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విద్యార్థులు నిషేధిత ఆర్గనైజేషన్స్ పట్ల ఆకర్షితులు కావద్దని కోరారు సీపీ.

Tags

Read MoreRead Less
Next Story