బ్రహ్మచారిని బాబు.. అమ్మాయి ఎలా ఉన్నా ఓకే.. ఎవరైనా..

బ్రహ్మచారిని బాబు.. అమ్మాయి ఎలా ఉన్నా ఓకే.. ఎవరైనా..

36 ఏళ్లొచ్చాయి ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావురా.. వచ్చిన సంబంధాలన్నీ ఏదో ఒక వంక పెట్టి పంపించేస్తావు. అసలు నీకు ఎలాంటి పిల్ల నచ్చుతుంది.. ఈ జన్మకి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా.. స్నేహితులు కలిసినప్పుడల్లా పెళ్లి పేరెత్తితే పరారైపోతున్నాడు. ఈ మధ్య ఎందుకో పెళ్లి మీద మనసు పోతోంది. ఇక బ్రహ్మచారిగా ఉండడం నావల్ల కాదంటూ అమ్మాయి కోసం వేట ప్రారంభించాడు బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్ధిఖీ. తను లావుగా ఉన్నా పర్లేదు. చూసేందుకు అసహ్యంగా ఉన్నా నో ప్రాబ్లమ్. ఆఖరి బట్టతల ఉన్నా ఐయామ్ రెడీ టూ మ్యారీ.. నాకు అమ్మాయి కావాలంతే అని నవాజుద్దీన్ చెబుతున్న ఫన్నీ డైలాగ్‌తో 'మోతీచూర్ చక్నాచూర్' సినిమా ట్రైలర్ ప్రారంభం అవుతుంది. నవాజుద్దీన్ సిద్దిఖీ, అతియా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు దేబ్మిత్రా బిస్వాల్. వినోదాత్మక కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు. జీవిత భాగస్వామి కోసం ఆరాటంగా ఎదురుచూస్తున్న ఇద్దరి కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. విదేశాలకు వెళ్లాలని కలలు కనే అమ్మాయి పాత్రలో అతియా నటించింది. నవాజ్ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడనుకుని.. వయసు ఎక్కువైనా అతడిని వివాహం చేసుకుంటుంది. తరువాత అసలు విషయం తెలిసి షాకవుతుంది. ఈ చిత్రం నవంబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Read MoreRead Less
Next Story