మాజీ మంత్రి పీఏ ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో..

మాజీ మంత్రి పీఏ ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో..

కర్నాటకలో మాజీ మంత్రి పరమేశ్వర PA రమేష్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. 2 రోజులుగా పరమేశ్వరకు చెందిన ఇల్లు, కాలేజీల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆస్తులకు సంబంధించిన కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకుని లావాదేవీలను విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలనే శనివారం రమేష్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. బెంగళూరులోని ఓ యూనివరిసిటీ గ్రౌండ్‌లో చెట్టుకు ఉరి వేసుకుని రమేష్ సూసైడ్ చేసుకున్నాడు. అక్కడే కారు వదిలిపెట్టి అందులో సూసైడ్ నోట్ కూడా ఉంచాడు. తన చావుకు IT అధికారుల వేధింపులే కారణమని ఆ లేఖలో పేర్కొన్నాడు. తాను సొంతంగా సంపాదించిన ఆస్తిపై కొర్రీలు వేస్తూ.. కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని రమేష్ లేఖలో ఆరోపించాడు. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేకే చనిపోతున్నానని అన్నాడు. భార్య సౌమ్య తనను క్షమించాలంటూ సూసైడ్ నోట్‌లో రాశాడు. కూతురిని బాగా చూసుకోవాలని కోరారు. రమేష్ సూసైడ్‌పై రామనగర పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో క్లూస్‌ టీమ్ ఆధారాలు కూడా సేకరించింది.

8 ఏళ్లుగా పరమేశ్వర వద్ద పీఏగా పనిచేస్తున్నాడు పీఏ రమేష్. ప్రస్తుతం ఆ మాజీ మంత్రి ఆస్తులపై దాడుల్లో సందర్భంగా PA నివాసంలోనూ తనిఖీలు చేశారు ఐటీ అధికారులు. దీంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన రమేష్ చివరికి బలవరన్మరణానికి పాల్పడ్డాడు. సూసైడ్‌కి ముందు ఒకరిద్దరికి తాను చనిపోతున్నట్టు చెప్పాడని కూడా తెలుస్తోంది. ఐతే.. అతను ఒత్తిడిలో అలా అంటున్నాడని అనుకున్నారు తప్ప నిజంగా ప్రాణాలు తీసుకుంటాడని ఊహించలేకపోయారు. రూ.వేల కోట్ల ఆస్తులకు సంబంధించిన లెక్కలు తేల్చే పనిలో IT అధికారులు చేసిన సోదాలు ఓ వ్యక్తి ప్రాణం తీయడం ఇప్పుడు కన్నడనాట సంచలనమైంది. రమేష్ కాల్‌డేటాను కూడా ఇప్పుడు విశ్లేషించే పనిలో ఉన్నారు పోలీసులు. ఆత్మహత్య ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story