కుక్క పిల్లలపై పంజా విసిరిన నాగుపాము

కుక్క పిల్లలపై పంజా విసిరిన నాగుపాము

నాగుపాము కాటుకు రెండు కుక్క పిల్లలు ప్రాణాలు కోల్పోయాయి. నిద్రిస్తున్న కుక్క పిల్లలను చుట్టుముట్టిన పాము.. బుసలు కొడుతూ కుక్క పిల్లలపై పంజా విసిరింది. దీంతో రెండు కుక్క పిల్లలు స్పాట్‌లోనే చనిపోయాయి. ఎల్‌బీనగర్‌లోని నాగోల్‌ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది.

తన పిల్లలకు అపాయం తలపెడుతుందన్న విషయం తెలుసుకున్న తల్లి కుక్క.. ఘటనా స్థలానికి చేరుకుని అరవడం మొలుపెట్టింది. గట్టిగా అరుస్తూ పామును తరిమేందుకు ప్రయత్నించింది. కానీ ఆ నాగుపాము అదరలేదు. బెదరలేదు. పైగా తల్లి కుక్క అరుస్తుండగానే కుక్క పిల్లలను బుసలు కొడుతూ కాటేసింది. దీంతో తన పిల్లలు కళ్లెదుటే చనిపోతుండడాన్ని చూసి తల్లి కుక్క తల్లడిల్లిపోయింది. చాలా సేపు కుక్క అరవడంతో ఆ పాము అక్కడి నుంచి చిన్నగా జారుకుంది. ఈ దృశ్యాలు సెల్‌ ఫోన్లలో రికార్డు చేశారు స్థానికులు.

Tags

Read MoreRead Less
Next Story