హుజూర్ నగర్ ఉపఎన్నిక : ఎవరెవరు ఎంతెంత ఖర్చు చేశారంటే..

హుజూర్ నగర్ ఉపఎన్నిక ప్రచారం, అభ్యర్థుల ఖర్చు వివరాలు, కేసులు, నగదు, మద్యం పట్టివేత వివరాలను రిలీజ్ చేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రయ్య. ఇప్పటి వరకు 72 లక్షల 29వేల 500 రూపాయల నగదును పట్టుకున్నారు..7వేల లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 10 కేసులు, సి విజిల్ యాప్ ద్వారా 15 కేసులు నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు...ఉపఎన్నికల ప్రచారం కోసం మొత్తం 104 వాహనాలను ఉపయోగిస్తున్నారు..
టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఇప్పటి వరకు 8 లక్షల, 65 వేల, 112 రూపాయలు ఖర్చు చేశారు. తర్వాతి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి ఉన్నారు. ఈమె 5 లక్షల 27వేల 621 రూపాయలు ఖర్చు చేశారు...బీజేపీ క్యాండిడేట్ కోట రామారావు 4 లక్షల 22 వేలు, టీడీపీ అభ్యర్థి 3 లక్షల 46 వేలు..స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న 3 లక్షల 73 వేలు ఖర్చు చేసినట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు...
హుజూర్‌నగర్‌లో ఈ నెల 21న ఉప ఎన్నిక జరుగనుంది. పోలింగ్‌కు టైం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు ప్రచార హోరు పెంచాయి. గెలుపుపై ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com