కులాంతర వివాహం.. కూతురిని దహనం చేసిన తల్లిదండ్రులు

చిత్తూరు జిల్లాలో పరువుహత్య కలకలం రేపుతోంది. తక్కువ కులానికి చెందిన అబ్బాయిని పెళ్లిచేసుకుందంటూ కూతురిని చంపేశారు తల్లిదండ్రులు. కాళ్ల పారాని కూడా ఆరకముందే తిరిగిరాని లోకాలకు పంపారు. జిల్లాలోని శాంతిపురం మండలం రెడ్లపల్లిలో జరిగింది ఈ దారుణ ఘటన..
రెడ్లపల్లిలో బీసీ కులానికి చెందిన చందన, వడ్డుమడి గ్రామానికి చెందిన నందకుమార్ ప్రేమలో పడ్డారు. పెద్దలను ఎదురించి 2 రోజుల క్రితం వివాహం చేసుకున్నారు.. మొదట ఈ పెళ్లిని అంగీకరించినట్లు చెప్పారు చందన తల్లిదండ్రులు. నిన్న మధ్యాహ్నం ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. రాత్రి ఏం జరిగిందో గానీ... ఉదయంకల్లా అమ్మాయిని దహనం చేసిన తల్లిదండ్రులు.. బూడిద కూడా దొరక్కుండా చేశారు...
చందన నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో నందకుమార్ పోలీసుల్ని ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన పోలీసులు...చందన ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల్ని ప్రశ్నించారు. అయితే చందన ఉరేసుకొని చనిపోయిందని.. అందుకే దహనసంస్కారాలు పూర్తిచేశామని చెప్పారు తల్లిదండ్రులు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com