వరద ఉధృతికి కొట్టుకుపోయిన యువకుడు.. చివరకు..

వరద ఉధృతికి కొట్టుకుపోయిన యువకుడు.. చివరకు..

ఎగువన కురుస్తున్న వర్షాలకు యాదాద్రి జిల్లాలోని ఆత్మకూరు మండలం కొరటికల్ గ్రామంలో బిక్కేరు వాగు పొంగిపొర్లుతోంది. ఈ వరద ప్రవాహాన్ని చూసేందుకు.. స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఐతే.. అక్కడ సరదాగా వాగులోకి దిగిన వాళ్లలో ఓ యువకుడు ఆ ఉధృతికి కొట్టుకుపోయాడు. వాగులో కొద్దిదూరం వెళ్లిపోయాడు. అదృష్టవశాత్తూ ఇంతలో ఓ చెట్టు దొరకడంతో దాన్ని పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్నాడు. ఇంతలో స్థానికులంతా అప్రమత్తమై తాడు సాయంతో యువకుడిని బయటకు లాగారు.

Tags

Read MoreRead Less
Next Story