అరుదైన ఘటన : చితి మీదనుంచి లేచిన వృద్ధుడు

అరుదైన ఘటన : చితి మీదనుంచి లేచిన వృద్ధుడు
X

మరణం అంచుల వరకు వెళ్లి.. తిరిగి వచ్చే అదృష్టం ఎవరికో దక్కుతుంది. అటువంటి అవకాశం ఒడిశాకు చెందిన సిమాంచల్ మల్లిక్ అనే వ్యక్తికి దక్కింది. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా సోరాడా బ్లాక్ పరిధిలోని హరిపూర్ గ్రామానికి చెందిన సిమంచల్(74) చనిపోయినట్లు భావించబడ్డాడు.. దాంతో ఆదివారం అతని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అతన్ని కాల్చడం కోసం చితిమీద పడుకోబెట్టారు.. హఠాత్తుగా అతను పైకి లేచి కూర్చున్నాడు.

సిమాంచల్ మల్లిక్ శనివారం మేకలను మేపడానికి పొలాల్లోకి వెళ్ళాడు.. అయితే అతను రాత్రి అయినా కూడా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఖంగారు పడిన కుటుంబసభ్యులు అతనికోసం వెతకటం ప్రారంభించారు. ఈ క్రమంలో వ్యవసాయ భూమి వద్ద అపస్మారక స్థితిలో పది ఉండటాన్ని గమనించారు. దాంతో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా చనిపోయాడని భావించి ఇంటికి తీసుకెళ్లారు. ఇంతలో చివరి చూపు కోసం బంధువులకు కబురు చేశారు. ఆ వెంటనే దహన సంస్కారాల కోసం ఏర్పాట్లు చేశారు..

చితికి నిప్పుపెట్టే సమయంలో.. అతనికి చుట్టిన వస్త్రాన్ని తొలగిస్తుండగా ఊపిరి ఆడుతున్నట్లు గమనించారు. అంతలోనే కళ్లు తెరిచిన మల్లిక్‌ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. అంతే ఒక్కసారిగా అక్కడున్న జనాలందరూ బీతిల్లిపోయారు. ఒక్క క్షణం ఏమి జరుగుతుందో అర్ధం కాక అలాగే చూస్తుం ఉండిపోయారు. ఎట్టకేలకుఅతడు మరణించలేదని.. వెంటనే, సిమంచల్‌ను సోరాడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు (సిహెచ్‌సి) తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఒకరోజు చికిత్స అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు.

ఈ సంఘటన గురించి సిమాంచల్ మాట్లాడుతూ.. “నేను గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను. భోజనం చేసిన తరువాత మేకలను మేపడానికి వెళ్ళాను. జ్వరం కారణంగా, నేను మైదానంలో కూలిపోయాను మరియు రాత్రంతా అపస్మారక స్థితిలో ఉన్నాను. కానీ నా కుటుంబ సభ్యులు నన్ను అంత్యక్రియల చితి మీద ఉంచి వెలిగించే సమయానికి నేను నా ప్రాణాన్ని తిరిగి పొందాను.” అని అన్నారు.

కాగా వైద్య అధికారి దిలీప్ నాయక్ మాట్లాడుతూ.. వ్యక్తి చనిపోయారని భావించి వైద్య పరీక్షలు లేకుండా శ్మశానవాటికకు తీసుకెళ్లడం సరికాదని, అలాంటి సంఘటన జరిగితే అది చట్టవిరుద్ధమని అన్నారు. "అతన్ని ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చినప్పుడు, అతని ఆరోగ్య పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. నేను అతనికి సెలైన్ మరియు ఇంజెక్షన్ ఇచ్చాను, తరువాత అతను కోలుకున్నాడు." అని వెల్లడించారు.

Tags

Next Story