పేలిన గ్యాస్ సిలిండర్.. 10మంది మృతి

X
By - TV5 Telugu |14 Oct 2019 1:05 PM IST
ఉత్తరప్రదేశ్‌లోని మవు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి 2అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగింది. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు తగిన వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com