మెగాస్టార్ అక్కడికి వెళ్లకుండా జగన్ ఇంటికే వెళ్లడం వెనుక లెక్కేంటి?

ఏపీ సీఎం జగన్ కలిశారు మెగాస్టార్ చిరంజీవి. స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి తాడేపల్లికి వచ్చిన చిరంజీవి దంపతులు... జగన్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు చిరంజీవి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువతో సత్కరించారు. చిరంజీవి సతీమణి సురేఖకు చీరను బహుకరించారు జగన్ సతీమణి భారతి.
ఇది మర్యాద పూర్వక భేటీయేనని చెప్తున్నా.. ఈ ఇద్దరి సమావేశం అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. సైరా సినిమా చూడాలంటూ జగన్‌ను ఆహ్వానించారు చిరు. స్పెషల్ షో వేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. నిజానికి 11వ తేదీనే భేటీ కావాల్సి ఉన్నా.. ఇవాళ్టికి వాయిదా పడింది. ఈ విందు సమావేశం వైసీపీ శ్రేణుల్లో, మెగా అభిమానుల్లో చర్చనీయాంశమైంది.
కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి.. ఇప్పుడు ఏపీ సీఎంను ఎందుకు కలిశారన్నది హాట్ టాపిక్ అయ్యింది. సినిమా, ఫ్యామిలీ పంక్షన్లలో తప్ప పవన్ కల్యాణ్‌ను కూడా చిరంజీవి ప్రత్యేకంగా కలిసిన సందర్భం లేదు. అలాంటిది ఇప్పుడు సచివాలయానికి బదులు ఏకంగా సీఎం ఇంటికే వెళ్లడం వెనుక లెక్కేంటనేది ఆసక్తి రేపుతోంది. దసరాకి రిలీజైన సైరా సినిమాకి అదనపు షో లు వేసుకోవడానికి అనుమతులిచ్చిన నేపథ్యంలో ఇది మర్యాదపూర్వక భేటీయేనని చిరు సన్నిహితుల మాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com