పోలవరం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు - షెకావత్‌

పోలవరం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు - షెకావత్‌
X

పోలవరం ప్రాజెక్టు తాజా పరిస్థితిపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు నివేదిక సమర్పించారు ఏపీ బీజేపీ నేతలు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం చూపిన అలసత్వంపై ఫిర్యాదు చేశారు. టీడీపీ, వైసీపీ రెండూ పోలవరం ప్రాజెక్టును రాజకీయకోణంలోనే చూస్తున్నాయని విమర్శించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. పోలవరంపై తన విధానమేంటో జగన్‌ స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు .

పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేసే బాధ్యత కేంద్ర తీసుకుంటుందన్నారు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌. ఏపీ ప్రభుత్వం తీసుకున్న రివర్స్‌ టెండరింగ్‌తో పాటు ఇతర అంశాలపై కేంద్రం వద్ద వివరాలు లేవని అన్నారు. పోలవరం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ స్పందన బట్టి కేంద్రం తదుపరి నిర్ణయం ఉంటుంది తేల్చి చెప్పారు షెకావత్‌.

Tags

Next Story