ఆటో బోల్తా.. విద్యార్థి మృతి

X
By - TV5 Telugu |14 Oct 2019 1:37 PM IST
కర్నూలు జిల్లాలో జరిగిన ఆటో ప్రమాదం ఓ విద్యార్థి ఉసురు తీసింది. మంత్రాలయం మండలం మాలపల్లి గ్రామ సమీపంలో ఓ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో చౌళహల్లి గ్రామానికి చెందిన గౌస్ అనే 7వ తరగతి విద్యార్థి చనిపోయాడు. మరో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com