అందువల్ల రైతులకు సాయం అందే పరిస్థితి లేదు : టీడీపీ

అందువల్ల రైతులకు సాయం అందే పరిస్థితి లేదు : టీడీపీ
X

రైతు భరోసా పథకం గందరగోళంగా మారిందన్నారు టీడీపీ నేతలు. ఇంతవరకూ పూర్తిస్థాయిలో అర్హులను ప్రకటించలేదని... నిజమైన అర్హులకు కూడా జాబితాలో చోటు దక్కలేదన్నారు. ఆన్‌ లైన్‌ లో సరైన వివరాలు లేకపోవడంతో రైతులకు సాయం అందే పరిస్థితి లేదంటున్నారు టీడీపీ నేతలు. ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలే ఇందుకు కారణమన్నారు టీడీపీ ఎమ్మెల్సీలు.

అటు కౌలు రైతుల విషయంలో కూడా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని టీడీపీ నేతలంటున్నారు. మొత్తం 14 లక్షల మంది కౌలు రైతులు ఉంటే... ఇందులో రెండున్నర లక్షల మందికి కూడా రైతు భరోసా అందడం లేదన్నారు. ప్రభుత్వం నిబంధనల పేరుతో పథకాన్ని నీరుగారుస్తుందన్నారు.

Tags

Next Story