ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బంది పడకూడదని.. ప్రభుత్వం తాత్కాలిక ఉద్యోగులను నియమించి బస్సులు నడిపిస్తోంది. ఇందుకుగాను అవసరమైన డ్రైవర్, కండక్టర్, ఇతర సిబ్బంది భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దినసరి వేతనంతో వీరిని విధుల్లోకి తీసుకుంటున్నారు. డ్రైవర్‌కు రోజుకు రూ.1500, కండక్టర్లకు రూ.1000 అందించనున్నారు. అలాగే మెకానిక్, ఎలక్ట్రీషియన్, టైర్ మెకానిక్, క్లరికల్ సిబ్బందికి రూ.1000 అందించనున్నారు. ఇక ఐటీ ట్రైనర్ నిపుణులకు రోజుకు రూ.1500 చెల్లించనున్నారు. ఆసక్తి, నైపుణ్యంఉన్న అభ్యర్థులను సంప్రదించవలసిందిగా అధికారులు తెలియజేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story