20 ఏళ్ల తరువాత భార్యాభర్తలిద్దరూ కలిసి..

20 ఏళ్ల తరువాత భార్యాభర్తలిద్దరూ కలిసి..

అందమైన అలనాటి హీరోయిన్.. మంచి కుటుంబ కథా చిత్రాలు తీసే దర్శకుడు.. ఇద్దరూ భార్యాభర్తలై ఎవరి వృత్తుల్లో వారు బిజీగా ఉన్నారు రమ్యకృష్ణ, కృష్ణవంశీలు. వీరిద్దరి కాంబినేషన్‌లో 1998లో చంద్రలేఖ సినిమా వచ్చింది. మళ్లీ ఇప్పుడు 20 ఏళ్ల తరువాత ఇద్దరూ కలిసి ఓ చిత్రం కోసం కలిసి పని చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం కృష్ణ వంశీ తన భార్య రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. ఇందులో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, అవికాగోర్ ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనున్నట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story