మందు కలిపిన కూల్‌ డ్రింక్‌ తాగి చిన్నారి మృతి

మందు కలిపిన కూల్‌ డ్రింక్‌ తాగి చిన్నారి మృతి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెర్కపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. పురుగుల మందు కలిపిన మాజా కూల్‌ డ్రింక్‌ తాగి ఓ చిన్నారి మృతి చెందగా.. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపిన మాజా బాటిల్‌ను రోడ్డుపై పడేశారు. దీంతో బానోతు తిరుపతి అనే వ్యక్తి.. ఆ మాజా బాటిల్‌ను ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు. దీంతో అందులోని కూల్‌ డ్రింక్‌ తాగిన ఇద్దరు చిన్నారులు అపస్మారస్థితిలోకి వెళ్లిపోయారు. బాబు స్పాట్‌లోనే మృతి చెందగా.. పాప కరీంనగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Tags

Read MoreRead Less
Next Story