హైకోర్టు ఆదేశాలతో ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయాలు

హైకోర్టు ఆదేశాలతో ఆర్టీసీ జేఏసీ  కీలక నిర్ణయాలు

తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో.. ఆర్టీసీ సమ్మె ఓ కొలిక్కివచ్చే అవకాశం కనిపిస్తోంది. అటు ప్రభుత్వాన్ని, ఇటు కార్మికులపై ప్రశ్నల వర్షం కురిపించిన ఉన్నత న్యాయస్థానం.. సమ్మె పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెండ్రోజుల్లో శుభవార్తతో రావాలన్నారు. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతలు.. టీఎన్జీవో నేతలతో సమావేశయ్యారు. 11 రోజులుగా సాగుతున్న సమ్మెపై సంఘాల నేతలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వంతో.. చర్చలకు టీఎన్జీవో అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డిని పంపాలని నిర్ణయించారు.

ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించినట్లు తెలిపారు టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి. 11రోజులుగా సమ్మె చేస్తున్న వేలాది మంది కార్మికులు తమ మద్దతు కోరుతున్నారన్నారు. బుధవారం సీఎస్‌ను కలిసి ఆర్టీసీ సమస్యల్ని విన్నవిస్తామన్నారు. ఇద్దరు కార్మికుల మృతి తమను కలిచివేసిందని.. సమ్మెకు ఇకనైనా ముంగిపు పలకాల్సి ఉందని రవీందర్‌ రెడ్డి అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story