కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ సర్కారు

మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ సర్కారు. చేనేత కార్మికుల కోసం కొత్త పథకాన్ని తేబోతున్నారు. వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం కింద ఏడాదికి రూ. 24 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఏటా డిసెంబర్ 21న అందజేస్తారు. మత్య్సకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయం 10 వేలకు పెంచారు. మైకనైజ్డ్ బోట్లు ఉన్నవారికే కాకుండా తెప్పలపై వేట సాగించేవారికి కూడా పథకం వర్తిస్తుంది. మత్య్సకారులకు డీజిల్‌పై లీటర్‌కు 9రూపాయల సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇందుకోసం నిర్దేశిత బంకుల్ని ఏర్పాటు చేయనున్నారు. హోంగార్జుల జీతాల పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రోజుకు ఇచ్చే 600 అలవెన్స్ 710 రూపాయాలకు పెంచారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల గౌర వేతనం వెయ్యి నుంచి 3 వేలకు పెంచారు. అందరికి సురక్షితమైన మంచినీరు అందించేందుకు వాటర్ గ్రిడ్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బార్ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్న మూడేళ్లలోపు జూనియర్ న్యాయవాదులకు నెలకు 5 వేలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఆర్టీసీలో కాలం చెల్లిన 3న్నర వేల బస్సులు తొలగించి... కొత్తవి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం వెయ్యికోట్ల రుణానికి ఆర్టీసీకి అనుమతి ఇచ్చింది కేబినెట్. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు దోపిడికి గురికాకుండా.. ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుకు సైతం ఆమోద ముద్ర వేసింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వారి ఖాతాల్లోనే జీతాలు వేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com