బాలుడిని బలితీసుకున్న నాటు వైద్యం

బాలుడిని బలితీసుకున్న నాటు వైద్యం
X

విజయవాడలో నాటు వైద్యం పేరుతో దారుణం చోటు చేసుకుంది. నాటు వైద్యం వికటించి కడప జిల్లాకు చెందిన బాలుడు హరనాథ్‌ మృతి చెందాడు. చికిత్స పొందుతున్న మరో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు.

గత కొంత కాలంగా ఓ నాటు వైద్యుడు యూ ట్యూబ్ ద్వారా బుద్ధిమాంద్యానికి చికిత్స చేస్తానంటూ ప్రకటనలు ఇచ్చాడు. ఆ ప్రకటన చూసి బెంగళూరు, బళ్లారి, తెలంగాణ, కడప ప్రాంతాలకు చెందిన 11 మంది బాధితులు విజయవాడ వచ్చారు. నాటు వైద్యుడు భూమేశ్వరరావు గవర్నర్‌పేటలోని గంగోత్రి లాడ్జిలో 3 గదులు అద్దెకు తీసుకుని నాలుగు రోజులుగా వారికి వైద్యం చేస్తున్నాడు. ఈ క్రమంలో నాటు వైద్యం వికటించి బాలుడు హరనాథ్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నాటు వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు.

Tags

Next Story